ఏపీలో ప్రస్తుతం జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జనసేన పార్టీ సమావేశాలను ఏర్పాటు చేశారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ సమావేశాలలో జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాలలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీకి నష్టం కలిగే విధంగా ఎలాంటి పనులు చేయకూడదని, పార్టీ విధి విధానాలను దాటి వ్యవహరించకూడదని సూచించినట్లుగా సమాచారం అందుతుంది.

ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నివేదికలు అన్నీ తన వద్దన ఉన్నాయని చెప్పారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ చేరువలో ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు త్వరలోనే పార్టీ కార్యకర్తల ఇంటికి వెళ్లి ఒక రోజు ఉండి వారి కష్టాలను తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, జనసేన పార్టీ సమావేశాలు రేపటితో పూర్తి అవుతాయి. ఈ సమావేశాలలో భాగంగా పార్టీని అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకొని వారి అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవన్ కళ్యాణ్ సూచించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.