ఎఫ్3 కి అంతా సిద్ధం.. కానీ నిర్మాతలకు భారీ షాక్..!?

-

యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కించిన ఈ సినిమా సినిమా చూసిన ప్రేక్షకులు అందరికి ప్రస్టేషన్ మొత్తం పోగొట్టి కడుపుబ్బ నవ్వించింది. ముఖ్యంగా ఈ సినిమాలో సరికొత్త కథతో అందరికీ మరింత కనెక్ట్ అయి పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కించేందుకు ప్రస్తుతం అంతా సిద్ధం అవుతోంది.

అయితే ఎఫ్ 2 సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమాలో ప్రస్తుతం హీరోలు వెంకటేష్ వరుణ్ తేజ్ లు రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచినట్లు తెలుస్తోంది. గతంలోనూ సినిమా కోసం 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న వెంకటేష్ వరుణ్ తేజ్ లు ఎఫ్3 సినిమా కోసం 13 కోట్లు డిమాండ్ చేశారట. ఇక మరోవైపు ఎఫ్2 సినిమా తర్వాత సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమా తెరకెక్కించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని మరింత క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రెమ్యునిరేషన్ పెంచాడట. దీంతో నిర్మాతలకు భారీ షాక్ తగిలినట్లు టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news