టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే ఒక్కసారి అవకాశం రావాలి అంటే హీరోయిన్ లు కచ్చితంగా దర్శక నిర్మాతలు చెప్పినవి చెయ్యాలి. అందరూ కాకపోయినా కొందరు హీరోలు నిర్మాతలు, దర్శకులు ఏదోక విధంగా హీరోయిన్స్ ని వేధిస్తూ ఉంటారు. అందమైన అమ్మాయి సినిమాలో నటించడం అనేది అంత సాధారణ విషయం కాదు. ఈ మధ్య ఇది మరీ ఎక్కువగా ఉందని అంటున్నారు.
దీనిపై ప్రపంచానికి అసలు విషయాలు చెప్తే ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. తాజాగా ఒక హీరోయిన్ సంచలన విషయాలు చెప్పింది. మల్హార్ రాథోడ్ తనకు గతంలో ఎదురైన అనుభవాన్ని వివరించింది. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఓ సీరియల్‌లో అవకాశం ఇస్తానని ఓ నిర్మాత చెప్పాడని ఆమె వివరించింది. ఆడిషన్ కోసం రమ్మన్నాడని చెప్పిన ఆమె… అతని వయసు 65 ఏళ్లని చెప్పింది
ఆడిషన్ కోసమని అతని రూమ్‌లోకి వెళితే తనతో అసభ్యంగా మాట్లాడాడు అని గుర్తు చేసుకుంది. `టాప్ తీసెయ్.. నేను చూడాలి` అన్నాడని చెప్పింది. నేను షాకయ్యానన్న ఆమె… అక్కణ్నుంచి వెంటనే బయటకు వచ్చేశా అని గుర్తు చేసుకుంది. టీవీ రంగంలో కూడా చాలా మంది లైంగిక వేధింపులకు పాల్పడతారని, లొంగకపోతే కెరీర్‌పై దెబ్బకొడతారని మల్హార్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.