ప్రియుడితో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న `ఆర్ఎక్స్ 100` భామ..వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

-

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ బ్యూటికి సూప‌ర్‌ క్రేజ్ వ‌చ్చింది. ప్రస్తుతం పాయల్ టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్రాళ్ల హృదయాల్లో అలజడి సృటించిన పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా అందాల ఆరబోత షురూ చేసింది. అయితే తాజాగా ఈ టాలీవుడ్ భామ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ప్ర‌స్తుతం తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఉత్తరాది భామ పాయల్ రాజ్ పుత్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కొన్న నెలల క్రితమే పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అతని గురించి అప్పుడు ఎలాంటి వివరాలను వెల్లడించకపోయినా… అతను ఆమె బోయ్ ఫ్రెండ్ అయివుంటాడనే అందరూ భావించారు. ఇప్పుడు అతనితో గడిపిన మరికొన్ని ఫొటోలను షేర్ చేస్తూ… అతనే తన ప్రాణం అని పాయల్ తమ ప్రేమకథను అభిమానులతో పంచుకుంది. పాయల్ ప్రియడి పేరు సౌరభ్ డింగ్రా. అతను ముంబైకి చెందిన మోడల్. చాలా కాలంగా అతనితో పాయల్ డేటింగ్ చేస్తోంది. ఈ రోజు సౌరభ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో అతనితో గడిపిన మరికొన్ని ఫొటోలను పాయల్ షేర్ చేసింది. ‘నాలోని లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో మరెవరూ లేరు. మనిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమే’ అని ట్వీట్ట‌ర్‌లో వెల్ల‌డించ‌గా.. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version