జాతకాలపై హీరోయిన్‌ పూజ హెగ్డే సంచలన వ్యాఖ్యలు

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను… టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కింది. అయితే ఈ సినిమా మొన్న థియేటర్లలో విడుదల అయింది. ప్రభాస్‌ సినిమా కావడంతో.. కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. అయితే…ఈ సినిమాలో ప్రభాస్‌ పామిస్ట్‌ గా నటించాడు. జాతకాలు, విధిరాత చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

అందుకే.. ఈ సినిమాలో ప్రమోషన్స్‌ లో ప్రభాస్‌-పూజ హెగ్డేలకు దానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు జాతకాలు నమ్ముతారా అనే ప్రశ్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజ హెగ్డేకు ఎదురైంది. దీనిపై పూజ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. నేను విధిని ఎక్కువగా నమ్ముతాను. విధిరాతప్రకారమే అంతా జరుగుతుందని.. భావిస్తూ.. ఉంటాను. విధిరాత నుంచి ఎవరూతప్పించుకోరు. దాని బారీ నుంచి ఎవరూ తప్పించలేరు. ఒక మధ్య తరగతి కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. మా ఫ్యామిలీలో అంతా బాగా చదువుకున్న వారే. కెరియర్‌ ఆరంభంలో వరుస ఫ్లాపులు చూశాను. అలాగే.. దైర్యంతో ముందుకు వెళ్లాను. సక్సెస్‌ అవుతున్నాను. కష్టపడితేనే… మంచి లైఫ్‌ ఉంటుందని పూజ హెగ్డే చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news