నేను ఆ బాధ భరించలేకే చేయించుకున్నా…!

-

కమల్ హాసన్ కూతురు అయినా, తండ్రికి ఒక రేంజ్ లో పలుకుబడి ఉన్నా సరే శృతి హాసన్ మాత్రం స్టార్ హీరోయిన్ అవలేకపోయింది అనేది వాస్తవం. ఎన్ని అవకాశాలు వచ్చినా ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆమె ఇబ్బంది పడింది. దీనితో దర్శక నిర్మాతలు కూడా శ్రుతీ ని పక్కన పెట్టడం ఆందోళన కలిగించింది. దీనితో ఆమె సినిమాలకు చాలా కాల౦ దూరంగా ఉండి ఒక వ్యక్తితో డేటింగ్ కూడా చేసింది.

ఏమైందో ఏమో గాని మళ్ళీ అతనికి బ్రేకప్ చెప్పి ఇప్పుడు సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇదిలా ఉంటే ఆమె సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది. తాను సర్జరీ చేయించుకున్నా అని ఒక బాధ భరించలేక ఈ సర్జరీ చేయించుకున్నాను అని చెప్పింది. “నేను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసా. కానీ చాలా సన్నగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. నేను ఇప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలు మూడు రోజుల గ్యాప్ మధ్యలో తీసినవి.

నేను చెప్పబోయే విషయం గురించి మిగితా ఆడవాళ్లు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. నాకు మెంటల్‌గా ఫిజికల్‌గా హార్మోనల్ సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు నా హార్మోన్స్‌ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అది అంత సులువు కాదు. బాధ భరించడం అంత సులువు కాదు, శారీరకంగా జరిగే మార్పులను తట్టుకోవడం అంత తేలిక కాదు. ఇతరులను వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు.

అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఈ విషయం చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. నేను ప్లాస్టిక్ సర్జరీలను సపోర్ట్ చేయడంలేదు. అలాగని వాటికి వ్యతిరేకిని అని కూడా చెప్పను. మనం ఎలా బతకాలని అనుకుంటున్నాం అన్నదే ముఖ్యం. మన శరీరాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వీకరించగలిగినప్పుడే మనకు మనం సాయం చేసుకున్నవాళ్లం అవుతాం. ప్రేమను పంచండి. రోజూ నన్ను నేను కాస్తా ఎక్కువ ప్రేమించుకోవడమే నా జీవితంలో నాకుండే గొప్ప ప్రేమ కథగా భావిస్తా. మీ జీవితం కూడా అంతేనని ఆశిస్తున్నా అని ఆమె సుధీర్గ పోస్ట్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version