ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో పోలవరం పనులను పరిశీలించనున్నారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులతో భేటీ అయి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం… ఆ మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అన్నదానిపై జగన్ సమీక్షించనున్నారు. ఇక ఉదయమే బయలుదేరి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరానికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరంపోలవరం పురోగతి పనులను పరిశీలించి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు.
సీఎం హోదాలో రెండోసారి జగన్ పోలవరానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను జగన్ తిలకించారు. ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు హెలిపాడ్ వద్ద పోలీసులు వైసీపీ నాయకులకు షాక్ ఇచ్చారు. జగన్ దగ్గరకు వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరస్పర వాగ్వాదం జరిగింది. అయితే అక్కడే ఉన్న మరికొందరు నేతలు రంగంలోకి సర్దిచెప్పి పంపడంతో వివాదం సద్దుమణిగింది.