హైదరాబాద్ లో సాయంత్రం నుండి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్,
నాగోల్, సికింద్రాబాద్‌తో పాలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. వర్షం ఆగకుండా వస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీస్ లు వదిలే సమయం కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న అకాల భారీ వర్షం నేపధ్యం లో విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ రఘుమా రెడ్డి సమీక్షించారు. భారీ వర్ష ప్రభావం గల రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ రఘుమా రెడ్డి పేర్కొన్నారు.
వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియ చేయమని సీఎండీ పేర్కొన్నారు. వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయమని సీఎండీ రఘుమా రెడ్డి కోరారు