రానున్న 48 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. కలెక్టర్ వినయ్ చంద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెం . 0891 – 2590102 , 0891- 2590100 ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి, వేటకు వెళ్లకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచనలు చేసారు. తీర ప్రాంతాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉంటే మంచిది అని హెచ్చరించారు. దీని కారణంగా తెలంగాణాలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతవరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాను తుఫాను మరింత కంగారు పెడుతుంది.