హీరో సూర్యకు హైకోర్టు షాక్ .. !

తమిళ హీరో సూర్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు కోట్ల ఆదాయ పన్ను చెల్లించాలని ఆదాయ శాఖ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. 2007-2008 మరియు 2008-2009 ఆర్థిక సంవత్సరాలను పరిగణనలోకి తీసుకొని 2010 సంవత్సరంలో సూర్య ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.

పైన పేర్కొన్న ఆర్థిక సంవత్సరాలకు మూడు కోట్ల 11 లక్షల 96 వేల రూపాయలను ఆదాయ శాఖకు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఐటి శాఖ మూడేళ్లు ఈ కేసును ఆలస్యం చేసింది అంటూ సూర్య 2018లో కోర్టును ఆశ్రయించారు. సూర్య ఎలాంటి డిఫాల్ట్ లేని పన్ను చెల్లింపుదారుడు అని కాబట్టి అతనికి మినహాయింపు ఇవ్వాలని అతని లాయర్ వాదించారు. కానీ సూర్య పన్నులు చెల్లించలేదని ఐటి శాఖకు సహకరించలేదని ఐటి శాఖ కౌన్సిల్ వాదించింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఐటీ శాఖకు అనుకూలంగా తీర్పు నిచ్చారు.