తెలంగాణ గవర్నర్ కు మాత్రువియోగం.. !

తెలంగాణ గవర్నర్ కు మాతృవియోగం జరిగింది. గవర్నర్ తమిళ సై సౌందరాజన్ తల్లి కృష్ణకుమారి (77) అనారోగ్యం కారణంగా మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారిని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఉదయం ఆవిడ కన్నుమూశారు.

దాంతో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వరకు గవర్నర్ మాతృమూర్తి పార్థివ దేహాన్ని రాజ్ భవన్ లో ఉంచబోతున్నారు. ఆ తర్వాత అంత్యక్రియల కోసం తమ స్వ స్థలం చెన్నై కి తరలిస్తారు. గవర్నర్ తల్లి మాతృవియోగం పై పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ తల్లి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు.