గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు.. హైకోర్టు కీలక ఆదేశాలు..!

-

తెలంగాణలో కరోనా టెస్టులు, చికిత్స తీరుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా టెస్టులు జరపాలంటూ ఆదేశించింది. 4 లక్షలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ప్రైవేటు ల్యాబ్‌ల్లో అన్నిరకాల పరీక్షలకు గరిష్ఠ చార్జీలు ఖరారు చేయాలని సూచించింది.

ఆస్పత్రుల్లోని బెడ్లు, వెంటిలేటర్ల వివరాలపై ఎప్పటికప్పుడు విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. ఇక నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేస్తున్నారని.. మరి చికిత్సలు చేస్తారో? లేదో? చెప్పాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో ఈ నెల 27లోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version