మెడికల్ సీట్లు.. హైకోర్టు కీలక తీర్పు

-

మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌పై ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే అని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆలిండియా కోటాలో 15 శాతం పోగా మిగిలినవి అన్నీ తెలంగాణకే వారికే అని అందులో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మంజూరైన వైద్య కళాశాలల్లో 85 శాతం సీట్లు తెలంగాణ వారికేనని అందులో స్పష్టం చేసింది.

అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేయగా.. వాటిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులనే తాజాగా తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. ఆలిండియా కోటాలో 15 శాతం పోగా… మిగిలినవన్నీ తెలంగాణ వారికేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు జీవో 72ను సవాల్‌ చేస్తూ పలువురు ఏపీ విద్యార్థులు పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. ఆ తర్వాత ఏపీకి చెందిన విద్యార్థుల పిటిషన్‌లను కొట్టివేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version