ఇండియా రెండు రోజులలో మొదటి ఇన్నింగ్స్ ను ముగించింది. నిన్న మొదలైన ఇండియా మరియు పాకిస్తాన్ ల సూపర్ 4 గేమ్… ఈ రోజు ముగింపుకు చేరుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో నిన్న పూర్తి ఆట కోనసాగలేదు, ఇక లక్కీగా రిజర్వు డే ఉండడంతో ఈ రోజు మ్యాచ్ సమయం కన్నా కూడా ఆలస్యంగా ప్రారంభం అయింది. నిన్న రెండు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఇండియా ఆ తర్వాత మరో వికెట్ ఇవ్వకుండా పరుగుల సునామీని సృష్టించింది. కోహ్లీ మరియు రాహుల్ లు మూడవ వికెట్ కు 223 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇండియాకు నిర్ణీత ఓవర్ లలో 356 పరుగులు చేసింది. కోహ్లీ (122) మరియు రాహుల్ (111) లు సెంచరీ లతో ఆకట్టుకుని పాకిస్తాన్ బౌలర్ల భరతం పట్టారు. ఇక ప్రస్తుతం ఇండియాకు ఉన్న బౌలింగ్ వనరులు చూస్తే పాకిస్తాన్ ఇంత భారీ స్కోర్ ను ఛేదించడం చాలా కష్టం.
ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆ వరుణ దేవుడిని కోరుకుని వర్షాన్ని రప్పిస్తే తప్ప ఓటమి తప్పేలా లేదు. ఇక బాబర్ ఆజామ్, రిజ్వాన్ , ఫకార్ జమాన్ లు రాణిస్తే ఉపయోగం ఉంటుంది.