ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిబిఐ విచారణకు హైకోర్టు నిరాకరణ

-

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపికి చుక్కెదురైంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిబిఐ విచారణకు హైకోర్టు నిరాకరించింది. కేసును విచారిస్తున్న సిట్ పై తమకు నమ్మకం లేదని, కేసును సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ ను తోసిపిచ్చింది.

సిట్ దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన తుది నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు, మీడియా, సీఎంవోకు గాని వివరాలు లీక్ చేయవద్దని హైకోర్టు తెల్చి చెప్పింది. ఇందుకు పూర్తి బాధ్యత సిపి వహించాలని స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version