తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..!

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపటి వరకు HCU సమీపంలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల బూమిలో చెట్లు కొట్టేయరాదని.. ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్న ఈ భూమి వివాదం పై వాటా ఫౌండేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ భూమిలో ప్రభుత్వ వేలాన్ని నిలిపివేయాలని.. వన్యప్రాణులకు ఆవాసమైన ఆ స్థలాన్ని జాతీయ పార్కుగా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది.

ఈ పిల్ పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ బుల్డోజర్లను ఉపయోగించి చెట్లను నరికివేస్తోందని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. అటవీ భూమిని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలన్నారు. ప్రభుత్వం ఆ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా చెట్లు కొట్టేసి ఆ స్థలంలో ఉన్న ఎన్నో వన్యప్రాణుల ప్రాణాలను రిస్క్ లో పెట్టిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news