కొడాలి నానికి 10 గంటల పాటు హార్ట్ సర్జరీ..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానికి శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ముంబై ఏషియన్ హార్ట్ హాస్పిటల్ లో కొడాలి నానికి సర్జరీ జరిగింది. ప్రముఖ కార్డియాక్ డాక్టర్ పాండ వైద్య బృందం సుమారు 10 గంటల పాటు సర్జరీ నిర్వహించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి కొడాలి నాని విశ్రాంతి తీసుకున్నారు. మరో మూడు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు. 

ఇదిలా ఉండగా.. వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా.. పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అయింది. దీంతో స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరం అవ్వచ్చని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను తీసుకొని నిన్న ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news