స్పీకర్ ది నిర్ణయాత్మక ఓటు మాత్రమే.. అంటే సంకీర్ణ ప్రభుత్వానికి ఉన్న బలం 99 మాత్రమే. ఇవాళ బల పరీక్ష నిర్వహించి ఉంటే.. ఖచ్చితంగా బీజేపీ నెగ్గేది. బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం వచ్చి ఉండేది.
అబ్బబ్బబ్బ.. కర్ణాటక రాజకీయాలు మాత్రం రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ మైండ్ గేమ్ సూపర్బ్. కేంద్రంలో అధికారంలో వచ్చిందో లేదో.. అంతే కర్ణాటక, తెలంగాణ, ఏపీ మీద పడింది బీజేపీ. ఎలాగైనా సౌత్ ఇండియాలో పార్టీని నిలబెట్టుకోవాలనే ఆశతో ఏం చేయడానికైనా బీజేపీ సిద్ధమవుతోంది.
తాజాగా కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేసింది. వాళ్లకు డబ్బు ఆశ చూపించింది. దీంతో… కొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీలపై తిరగబడ్డారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం కాస్త బలహీనమైంది.
అయితే.. బల పరీక్ష నిర్వహించాలని.. బల పరీక్షలో నెగ్గాకే మళ్లీ సీఎంగా కొనసాగుతానని కర్ణాటక సీఎం కుమారస్వామి స్పీకర్ కు వెల్లడించారు. ఇవాళ విశ్వాస పరీక్షకు సంబంధించిన తీర్మానంపై కర్ణాటక అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది.
అయితే… ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పెరిగి పెద్దదవడం… సభలో అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో స్పీకర్ బలపరీక్షను రేపటికి వాయిదా వేశారు. దీంతో బీజేపీకి ఇది మరో దెబ్బ అయిపోయింది.
ఎందుకంటే.. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాన్ని సరైన బలం లేదు. ఇప్పటికే 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు. ఒక ఎమ్మెల్యేకు ఆరోగ్యం బాగాలేదు. బీఎస్సీ ఎమ్మెల్యే కూడా డుమ్మా కొట్టాడు. మరో ఇద్దరు స్వతంత్రులతో కలిపి మొత్తం 19 మంది సభకు రాలేదు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి 100 మంది సభ్యుల బలం ఉండగా… బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. స్పీకర్ ది నిర్ణయాత్మక ఓటు మాత్రమే.. అంటే సంకీర్ణ ప్రభుత్వానికి ఉన్న బలం 99 మాత్రమే. ఇవాళ బల పరీక్ష నిర్వహించి ఉంటే.. ఖచ్చితంగా బీజేపీ నెగ్గేది. బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం వచ్చి ఉండేది.
అందుకే.. యడ్యూరప్ప… ఏది ఏమైనా.. ఇవాళ అర్ధరాత్రి అయినా.. బల పరీక్ష నిర్వహించాల్సిందేనని స్పీకర్ ను కోరినా… కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య… ఎమ్మెల్యేల రక్షణ అంశం గురించి గంట సేపు సభలో మాట్లాడటంతో… దానిపై స్పీకర్ అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. దీంతో యడ్డీ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇవాళ ఎలాగైనా తాను ముఖ్యమంత్రిని అవుతానని ఆశపడ్డ యడ్డీపై సిద్దప్ప నీళ్లు చల్లేశారు. చూద్దాం.. రేపు ఏం జరుగుతుందో?