హర్యానాలో రెండు వర్గాల మధ్యన గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలు చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా మారుతున్నాయి అని చెప్పాలి. కేవలం నూహ్ జిల్లాలో మాత్రమే జరుగుతున్న అల్లర్లు కాస్త ఇప్పుడు పక్కన ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. గురుగ్రమ్ లోనూ ఘర్షణలు జరుగుతున్నాయి, కాగా ఈ ఘర్షణల్లో కాల్పులు జరుగగా ఇద్దరు హోమ్ గార్డ్ లు మరణించారు. ఇక రాత్రి జరిగిన ఘర్షణల్లో ఒక్కరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. కాగా స్థానిక పోలీసులు తెలియచేస్తున్న సమాచారం ప్రకారం 30 మంది గాయాలు పాలయ్యారట. ఇక ఈ రోజు కూడా ఘర్షణలు తగ్గుతాయన్న హోప్ లేకపోవడంతో హోమ్ మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. అల్లర్లను అరికట్టడానికి హోమ్ మంత్రి అనిల్ విజ్ కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కాగా ఈ ఘటనలకు కారణమైన వారిపై చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.