వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయిన రాజాసింగ్ ఇంటికి 100 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఈరోజు ఆయన ఇంటి ముట్టడికి గోషామహల్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీస్ ఉన్నతాదికారులు. వరద సహాయం తన వర్గం వారికి ఇప్పిచుకున్నారు అంటూ గోషామహల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రాజాసింగ్ ఇంటివద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసారు.
దాదాపు వందమంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. నిజానికి ఈరోజు ఉదయం 9 గంటలకు గోషమహల్ నియోజక వర్గంలో మంగలహాట్ లో బీజేపీ ఎమ్యెల్యే రాజసింగ్ ఇంటి ముందు ప్రజా నిరసనకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అయితే నిజానికి వరద బాధితులకు ఇచ్చే పరిహారంపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ధికసాయాన్ని అనర్హులకు ఇచ్చారని ఫైర్ అయ్యారు రాజాసింగ్. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అడ్వాన్స్‌గా పరిహారాన్ని అందించారని సంచలన ఆరోపణలు చేశారు.