గద్వాల్ లో హైటెక్ వ్యభిచారం.. వెబ్ సైట్ నయా దందా..

-

గద్వాల్ జిల్లాలో హైటెక్ వ్యభిచారానికి తెరలేపారు కొందరు.. ఆన్‌లైన్‌లో ‘హాయ్‌’ అని పలకరిస్తే చాలు.. సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులు వాట్సాప్‌ నంబర్‌ అడుగుతారు. ఇక వెంట వెంటనే వాట్సాప్‌కు అమ్మాయిల విభిన్న రకాలు ఫొటోలు వచ్చిపడుతాయి. వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాట్సాప్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే అవతలి వ్యక్తి పురుషుడా..? మహిళా..? అని వివరాలు తెలుసుకొని పురుషుడు అయితే వెంటనే క్షణాల్లో అమ్మాయిల ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. ఒక్కో అమ్మాయికి ఒక్కో ధర నిర్ణయించారు. గంటకు ఒక లెక్క.. రాత్రికి అయితే ఇంకో లెక్క ధర నిర్ణయించారు. గంటకు దాదాపుగా రూ.2వేల నుంచి రూ.4వేల వరకు.., రాత్రి అయితే రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు రేటు. మాట్లాడుకుంటారు. ఈ తరహాలో చీకటి దందాను ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తున్నారు.

ఈ దందాలో ముఖ్యంగా విద్యార్థినులు, గృహిణిలు ఉంటున్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, చిలకలూరిపేట, అనంతపూర్‌ జిల్లాల నుంచి విద్యార్థినులు, మహిళలు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి వస్తున్నారు. సదరు అమ్మాయి 2, 3 రోజులు ఇక్కడే ఉండి దందా ముగించుకొని తిరిగి వెళ్లిపోతుంది. ఇలా రోజుకు పదుల సంఖ్యలో అమ్మాయిలు వస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version