గ్రేటర్ పోలింగ్ : పలు చోట్ల పరిస్థితి ఉద్రిక్తం

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ లో చాలాచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది బంజారాహిల్స్ లోని ఒక పోలింగ్ బూత్ వద్ద మాస్కుల కారణంగా వివాదం చెలరేగింది పార్టీ గుర్తు పెట్టుకొని 3 పార్టీల కార్యకర్తలు పోలింగ్ బూత్ లో కూర్చుని ఉండటం వివాదానికి కారణమైంది. అయితే అక్కడ అధికారులు ఎవరూ అభ్యంతరం తెలపక పోవడంతో ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది అలాగే తార్నాకలోని ఒక పోలింగ్ బూత్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. కాషాయం రంగు  మాస్కులు పెట్టుకొని పోలింగ్ బూత్ వద్ద కు వస్తున్నారని టిఆర్ఎస్ వర్గీయులు  చేతికి గులాబీ రంగు కంకణం కట్టుకుని వచ్చారంటూ బిజెపి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. గులాబీ కండువాతో పోలింగ్ స్టేషన్ లోకి బంజారాహిల్స్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి ప్రవేశించారు. ఇదేమిటి అంటూ బీజేపీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్లు 43 44 45 46 47 48 49 వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version