పొలిటికల్‌ ప్రమాణాలతో అనపర్తిలో హై టెన్షన్

-

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీ,టీడీపీ వర్గాల మధ్య అవినీతి ఆరోపణలు దేవుడి వరకూ తీసుకెళ్లాయ్‌. MLA సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత నల్లమిల్లి ఒకరిపై ఒకరు ఆవినీతి ఆరోపణలు చేసుకున్నారు. అంతే కాదు.. బిక్కవోలు గణపతి ఆలయంలో సతీ సమేతంగా ప్రమాణాలు కూడా చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఇందుకు పోలీసులు కూడా అంగీకరించారు. ఒక్కో వర్గం నుంచి ఐదుగురికి అనుమతి ఇచ్చారు.

ఇక విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి మధ్య రాజకీయ పరంగా ఎప్పటి నుంచో వైరం ఉంది. చాలా సందర్భాల్లో బస్తీమే సవాళ్లు నడిచాయి. అయితే గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు నల్లమిల్లి. దీంతో ఆయన… దేవుని ఎదుట ప్రమాణం చేస్తానంటూ సవాల్‌ విసిరారు. దాన్ని ఆయన కూడా స్వీకరించారు. దీంతో బిక్కవోలు, అనపర్తిలో 144 సెక్షన్‌ పెట్టారు. సతీ సమేతంగా ఆలయంలో ప్రమాణం చేస్తానన్న ఎమ్మెల్యే… నల్లమిల్లి అవినీతి చిట్టా తనవద్ద ఉందని అన్నారు.

ఎమ్మెల్యే అవినీతిపై సతీ సమేతంగా తాను కూడా వినాయకుడి ముందు ప్రమాణం చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. మొత్తానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తమ భార్యలతో కలిసి విగ్నేశ్వరుడి ముందు పొలిటికల్‌ ప్రమాణాలకు దిగడం తూర్పు గోదావరి జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version