ఈ నెల రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వైద్యారోగ్య శాఖా మంత్రి

-

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసి జనాల ఉపాధిని దూరం చేసి అల్లకల్లోలం సృష్టించిన కరోనా మన దేశంలో ఫస్ట్ ఫేజ్ కింద పీక్ కి వెళ్లి కిందికి  వచ్చిందని తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. బ్రిటన్ లాంటి దేశంలో సెకండ్ వేవ్ పేరిట కరోనా వైరస్ సోకుతుంది అని వార్తలు వస్తున్నాయని ఇప్పటికే భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎయిర్పోర్ట్ లో అక్కడి నుండి వచ్చిన వాళ్ళకి అక్కడే టెస్టులు చేసి ఐసోలేషన్ కి పంపుతున్నామని అన్నారు.

etela

పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ కి పంపడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితి చలికాలం ఇది ఇంకో నెల ఉంది కాబట్టి ఈ నెల రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు. సెకండ్ వేవ్ వచ్చినా రాకపోయినా చలి కాలం కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఏ పరిస్థితి వచ్చిన కూడా దాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సర్వ సన్నద్ధంగా ఉందని అన్నారు. సెకండ్ వేవ్ రాకూడదని ఎలా తగ్గిపోయిందో అలాగే ఉండాలని  కోరుకుంటున్నానన్న ఆయన ప్రజలందరూ దైర్యంగా,అప్రమత్తంగా ఉండాలని కోరారు>

Read more RELATED
Recommended to you

Exit mobile version