భారతీయ రైల్వే సేవలను కొందరు దుండగులు ఇల్లీగల్ పనులకు ఉపయోగిస్తున్నారు. నిషేధిత గుట్కా, గంజాయి లాంటివి సరఫరా చేస్తున్నారు. ప్యాసింజర్స్ ముసుగులో వీరాంతా చెలామణి అవుతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రం నుంచి రైళ్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన బెంజమిన్ గమాంగో(31) అనే వ్యక్తి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు రాగా.. అతని బ్యాగులో 4.5 కేజీల గంజాయిని ఉంది. అతని మీద అనుమానం వచ్చి పోలీసులు బ్యాగు చెక్ చేయగా అందులో గంజాయి దొరికింది. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్‌కు తరలించారు.