`దిశ‌` కేసులో న్యూ ట్విస్ట్‌.. మృతదేహాలకు రీ పోస్టుమార్టం..

-

దిశ హత్యాచార నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. అయితే దిశ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. దిశా కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఎన్‌కౌంటర్ కేసులో ఆధారాల సేకరణపై తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలిస్తామని.. ఢిల్లీ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తామని వెల్లడించింది.

మ‌రోవైపు కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ.. రాష్ట్రేతర నిపుణులతో రీపోస్టుమార్టం అవసరం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయం అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ నేప‌థ్యంలో తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మ‌రియు అటు రీ పోస్టుమార్టం చేయనున్న నేపథ్యంలో మృతదేహాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news