ఐఐటీల్లో ఉన్నత చదువులు.. జీతాలు మాత్రం నామమాత్రమే..!

-

దేశవ్యాప్తంగా ఉన్నత చదువులు చదువుతున్న ఐఐటీ విద్యార్థులకు మొన్నటివరకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ నెలకొన్న విషయం తెలిసిందే. సాధారణ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకంటే ఐఐటీల్లో చదివే వారికి టెక్నికల్ స్కిల్స్,క్రియేటివ్, మేనేజ్మెంట్, లీడర్ షిప్ స్కిల్స్ అధికంగా ఉంటాయని పేరుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగాను వీరికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ టైంలో కంపెనీలు పెద్దపీట వేస్తుంటాయి. కానీ, గత ఏడాదిన్నర కాలంగా ఐఐటీల్లో చదివిన విద్యార్థులకు సైతం పెద్దగా వేతన ప్యాకేజీలు రావడం లేదు. ఆ మధ్యకాలంలో ఐఐటీ విద్యార్థులకు ప్లేస్ మెంట్స్ కూడా రాకపోవడం చర్చ నీయాంశంగా మారింది.

ఇక పోతే కంపెనీలు ఐఐటీ స్టూడెంట్స్‌‌‌కు ఇస్తున్న వార్షిక వేతనం రూ.6లక్షల నుంచి రూ.7లక్షలలోపే ఉంటోంది. టాప్ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల ప్యాకేజీలపై ప్రభావం చూపిస్తున్నాయని సమాచారం. గతేడాది ఐఐటీ బాంబేలో 22 మందికి రూ.కోటి ప్యాకేజీ లభించగా.. అతితక్కువ ప్యాకేజీ రూ.4 నుంచి 6 లక్షలుగా నమోదైంది. ఖరగ్ పూర్, రూర్కీల్లో రూ.8లక్షలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news