కర్ణాటకలో తీవ్రం అవుతున్న ‘హిజాబ్’ వివాదం…

-

కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదం తీవ్రమవుతుంది. మెల్లి మెల్లిగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ వివాదం నెమ్మదిగా అన్ని జిల్లాలకు విస్తరిస్తుంది. ముస్లిం విద్యార్థినిలు తమ సంప్రదాయమైన హిజాబ్ ధరించి స్కూళ్లకు, కాలేజీలకు హాజరు అవడం పై హిందూ విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో హిందూ విద్యార్థిని, విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూలు కాలేజీలకు హాజరవుతున్నారు.

ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. బిజెపి పార్టీ పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రతిపక్షనేత సిద్ధరామయ్య బిజెపి పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మరోవైపు బిజెపి నాయకులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. హిజాబ్ గురించి విద్యార్థినిలు స్కూల్ లకు కాదు మదరసాల కు వెళ్లాలని విమర్శిస్తున్నారు. ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ వివాదం బెలగావి, కలబురిగి, శివమొగ్గ, హసన్, చిక్ మంగళూర్ జిల్లాలకు కూడా విస్తరించింది. దీనిపై నిన్న రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మాత సరస్వతి అందరిని సమానంగా చూస్తుందంటూ… ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version