మరికొన్ని గంటల్లో గుజరాత్ లోని అహమ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ లు ఆడనున్నాయి. ఒకవైపు బీసీసీఐ మరియు గుజరాత్ ప్రభుత్వం అంతా ఈ ఏర్పాట్లతో బిజీ గా ఉన్న తరుణంలో ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో ఖలిస్తానీ నినాదాలు కనిపించడంతో దేశం అంతటా కలకలం రేగుతోంది. ధర్మశాల జలశక్తి శాఖకు చెందిన ఒక భవనం గోడపైన కొందరు దుండగులు “ఖలిస్తానీ జిందాబాద్” అని రాయబడి ఉండడమే కాకుండా ఖలిస్తానీ పతాకాన్ని కూడా చిత్రీకరించి ఉంది. ఈ చిత్రాలను గమనించిన ధర్మశాల పోలీసులు సీరియస్ గా తీసుకుని అప్రమత్తం అయ్యారు.
ఇక ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్నది బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా ధర్మశాలలో ఉన్న గ్రౌండ్ లో వరల్డ్ కప్ కు సంబంధించి అయిదు మ్యాచ్ లు జరగనున్నాయి.