కేసీఆర్ ఫ్యామిలీలో కేహెచ్ఆర్ 6666 హాట్ టాపిక్‌..! ఎవరీ కేహెచ్ఆర్

-

క‌ల్వ‌కుంట్ల‌వారి కుటుంబంలో మూడోత‌రం కూడా తెలంగాణ రాజ‌కీయాల్లో ఆక్టివ్ కాబోతోంద‌న్న‌ది హిమాన్షు వైఖ‌రి తేల్చేస్తోంది. తండ్రి కేటీఆర్‌ లాగానే హిమాన్షు సోషల్‌ మీడియాలో

కేహెచ్ ఆర్ ఇటీవ‌లి కాలంలో ఈ పేరుతో సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్టులు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌పై.. ఆలోచించే విధంగా ఉండ‌టంతో ఆ పోస్టులు వైర‌ల్ మారుతున్నాయి. ఇంకా చెప్పాలంటే సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలు, పోస్టులు దుమ్మురేపుతున్నాయి. కేసీఆర్‌, కేటీఆర్ అనే పేర్ల‌కు కేహెచ్ఆర్ నేమ్ ద‌గ్గ‌ర ఉండ‌టం, ఇన్‌స్టాగ్రాం అకౌంట్ చివ‌ర‌న 6666 అంటూ కేసీఆర్‌కు వ‌లే ల‌క్కీ నెంబ‌ర్ 6 జోడించి ఉండ‌టంతో తెలంగాణ ప్ర‌జ‌లకు అది కేసీఆర్ కుటుంబీకుల‌దేన‌ని ఊహిస్తూ వ‌స్తున్నారు.

వాళ్లు ఊహించింది నిజ‌మేన‌ని చెప్ప‌క‌నే చెబుతూ హిమాన్షు తాను మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌తో క‌ల‌సి చేసిన ఓ ఇంట‌ర్వ్యూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయ‌డం విశేషం. తాజాగా హిమాన్షు మంత్రి సత్యవతితో కలిసి సైదాబాద్‌లోని బాల నేరస్థుల జువైనల్‌ హోంను సందర్శించ‌డం గ‌మ‌నార్హం. జువైన‌ల్ హోంలో బాల నేర‌స్థుల‌కు అందుతున్న విద్య‌, స‌దుపాయాల‌పై మంత్రితో క‌ల‌సి ఆరా తీశారట. ఆ తర్వాత ఇదే విషయంపై మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఇంటర్వ్యూ చేశారట. తాను చదివే స్కూల్లో బాలల సంక్షేమంపై ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారట. ఇందులో భాగంగానే తాను మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్లు హిమాన్షు ఆ పోస్టులో పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మనవడు కేహెచ్ఆర్ తాత లాగానే లక్కీ నెంబర్ 6.ను విశ్వ‌సిస్తాడని స‌మాచారం. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి కేహెచ్‌ఆర్‌ 6666 అని జ‌త చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా కేటీఆర్ పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ రాజ‌కీయాల‌పై చెర‌గ‌ని ముద్ర‌వేస్తున్నారు. తండ్రి ఉద్య‌మ‌కాలం నుంచి ఆయ‌న బాట‌లో న‌డిచి రెండు మార్లు టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డానికి కృషి చేశారు.

ఇక ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్లోనూ కీల‌క భూమిక పోషిస్తున్నారు. కాబోయే సీఎం ఆయ‌నేన‌న్న‌ది టీఆర్ఎస్ వ‌ర్గాల ధృడ విశ్వాసం. వాస్త‌వానికి ఇందులో ఆ విష‌యంపై పెద్దగా సందేహం కూడా అక్క‌ర్లేదు. మ‌రోవైపు క‌ల్వ‌కుంట్ల‌వారి కుటుంబంలో మూడోత‌రం కూడా తెలంగాణ రాజ‌కీయాల్లో ఆక్టివ్ కాబోతోంద‌న్న‌ది హిమాన్షు వైఖ‌రి తేల్చేస్తోంది. తండ్రి కేటీఆర్‌ లాగానే హిమాన్షు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version