లోతట్టు ప్రాంతాలకు అలర్ట్‌ : హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తివేత

-

మొన్నటి నుంచి హైదరాబాద్ తో పాటు.. చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిమాయత్‌ సాగర్‌లోకి వరద నీరు భారీగా చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇవాళ హిమాయత్‌ సాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. హిమాయత్ సాగర్ ఐదవ నంబర్ గేట్ ను ఎత్తి మూసి నదికి వదిలారు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

హిమాయత్ సాగర్ కు మొత్తం 17 గేట్లు ఉండగా..ప్రస్తుతం కేవలం మూడు గేట్లను మాత్రమే ఎత్తారు. వరద ఇలానే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తివేయనున్నారు అధికారులు. అయితే.. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ… మూసి పరివాహక ప్రాంతవాసులందరిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.

బంగారు తెలంగాణ అంటే చెరువులన్నీ నిండటమేనని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్. అన్నీ ఆలోచించే గెట్లు ఎత్తే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది ఇలా ఉండగా… హిమాయ‌త్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 1763.50 అడుగులు  కాగా… ప్రస్తుత నీటి స్థాయి 1762.80 అడుగులకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news