హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికిస్తుంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. ఈ హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ త్వరలోనే ఇంకో కొత్త రిపోర్ట్‌ను రిలీజ్ చేయనున్నది. ఆ సంస్థ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో వెళ్ళడించింది. ఇటీవల అదానీ స్టాక్స్ అంశంపై అమెరికాకు చెందిన ఈ హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ వల్లే.. ఆ కంపెనీ షేర్లు అన్ని పతనమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హిండెన్‌బర్గ్ ఎవర్ని టార్గెట్ చేసిందన్న కోణంలో పుకార్లు రేగుతున్నాయి . ఓ అతిపెద్ద విషయాన్ని బహిర్గతం చేయనున్నట్లు హిండెన్‌బర్గ్ తన ట్వీట్‌లో తెలిపింది.
జనవరి 24వ తేదీన అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ సంస్థ 106 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది. అదానీ సంస్థ ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆ నివేదికలో ఆరోపించింది. ఆ రిపోర్టు వల్ల అదానీ కంపెనీ ట్రేడింగ్‌లో సుమారు 86 బిలియన్ల డాలర్లు నష్టపోయింది. త్వరలో రిలీజ్ చేయబోయే రిపోర్టులో ఎవరి గురించి ఉంటుందన్న విషయాన్ని ఆ సంస్థ స్పష్టం చెయ్యలేదు. కానీ ఇటీవల అమెరికాలో జరిగిన బ్యాంకుల మూసివేత గురించి కొత్త రిపోర్టు ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయిమాత్రం వినికిడిలోకి వస్తున్నాయి.