హిందూత్వం అంటే ప్రతీవాడికి లోకువైంది : జనసేన నేత బొలిశెట్టి

-

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయం ఏకంగా సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.మరోవైపు లడ్డూ తయారీలో కల్తీనెయ్యి వాడినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియాతో ఎలా మాట్లాడుతారని ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. అయితే, సుప్రీం తీర్పును ప్రస్తావిస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు.

తాజాగా ప్రకాశ్ రాజ్ ట్వీట్స్‌కు జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అని ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘భక్తుడి గురించి మాట్లాడే ధైర్యం చేసిన మీరు కోర్టు విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరారోపితుడు జగన్‌కు కోర్టుకు హాజరుకావాలని చెప్పే సాహసం ఎందుకు చేయలేదు. గొడ్డలికి భయపడా? హిందూ మతం అంటే ప్రతివాడికీ లోకువైంది. మత ఆచారాలకు సాక్ష్యాలుండవు. ఆ విషయాలు కోర్టులో తేలవు’ అని బొలిశెట్టి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news