రాష్ట్రంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారు: ఎంపీ బండి సంజయ్ కుమార్

-

ఆదివారం చంగిచర్లలో సాయంత్రం హోలీ దహనం చేస్తుండగా హిందూ దేవుళ్ల పాటలు పెట్టగా ,అక్కడే ఉన్న మసీదు నుంచి వచ్చిన కొంతమంది యువకులు..మమ్మల్ని మీ పాటలు ఇబ్బందికి గురి చేస్తున్నాయని వారిపై గొడవకు దిగారు. దీంతో ఎస్సీ, ఎస్టీ కాలనికి చెందిన వారు కూడా ముస్లిం యువకులతో గొడవకు దిగారు.ఈ క్రమంలో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. అక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చిన ముస్లిం యువకులు అక్కడున్న వారిపై దాడి చేశారు.ప్రస్తుతము ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లా వైరల్ గా మారింది.ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు ఈరోజు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు హిందూ సంఘాల నాయకులపై లాఠీచార్జ్ చేశారు.

కాగా ఈ ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. రాష్త్రంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారని.. కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అంటూ ప్రశ్నించారు. హిందువులు శాంతియుతంగా పండుగలు జరుపుకోలేదా? చెంగిచెర్ల వద్ద బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జ్ ఎలా చేస్తారు? రజాకార్ల వారసులు, సంఘ వ్యతిరేక శక్తులు హిందువులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news