బంగ్లాదేశ్లో హిందువులను పాకిస్తాన్ సైన్యం, రజాకార్లు ఎంత ఘోరంగా హింసించేవారో తెలుసా?

-

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బంగ్లాదేశ్‌లోని సామాజిక-రాజకీయ వాతావరణం అనేది తరచుగా సరిహద్దులో తలనొప్పిగా మారింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. బంగ్లాదేశ్ నుండి లక్షలాది మంది పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం ఇంకా మేఘాలయ వంటి రాష్ట్రాలలో ఆశ్రయం పొందారు. అలాగే ఈ రాష్ట్రాల వారు కూడా బంగ్లాదేశ్ లో ఆశ్రయం పొందారు. చాలా మంది తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలనే ఆశతో వచ్చారు కానీ “శరణార్థి” అనే శాశ్వత ముద్ర వారిపై పడింది. ఎన్నో దశాబ్దాల తర్వాత, బంగ్లాదేశ్ మళ్లీ అశాంతిని ఎదుర్కొంటోంది. అక్కడ మైనారిటీ వర్గాలు అభద్రతాభావంతో పోరాడుతున్నందున, బెంగాలీ హిందువులు ఆ దేశంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూ లో 1971లో భారతదేశానికి పారిపోయిన సుశీల్ గంగోపాధ్యాయ అనే వ్యక్తి బంగ్లాదేశ్‌లోని నోఖాలీ జిల్లాలో తన సుసంపన్నమైన జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. సుశీల్ మాట్లాడుతూ.. “మాది పెద్ద కుటుంబం. అక్కడ మాకు విస్తారమైన భూములు ఉన్నాయి. కానీ అప్పుడు యుద్ధంలో, పాకిస్తాన్ సైన్యం ఇంకా రజాకార్లు మాపై దాడి చేశారు. మా ఇళ్ళని తగలబెట్టారు. ఇంకా చాలా మంది క్రూరంగా చంపబడ్డారు,” అని అతను వివరించాడు,అందువల్ల భారతదేశంలో శాశ్వత ఆశ్రయం పొందవలసి వచ్చిందని అన్నారు.

సుశీల్ తీవ్ర వేదనను వ్యక్తం చేస్తూ, “బంగ్లాదేశ్‌లో ఇటీవలి సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. గర్భిణీ స్త్రీని కడుపులో తన్నిన దృశ్యాలు చూశాను.ఇలాంటి క్రూరత్వం ఊహించలేము. ఒక భారతీయుడిగా, నేను వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. 1971 లో నా వయసు కేవలం 12 ఏళ్లు ఉంటుంది. ఆ టైంలో రజాకార్లు మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు. చాలా మంది హిందువులని కనికరం లేకుండా ఎంతో దారుణంగా చంపి వారి శరీరాలను నదులలో విసిరేసేవారు. అప్పుడు చాలా మంది హిందూ మహిళలను పాకిస్తాన్ సైన్యం చాలా దారుణంగా అత్యాచారం చేసి వారు గర్భం దాల్చేలా చేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ మచ్చలు అలాగే ఉన్నాయి”. అని అన్నారు. దీన్ని బట్టి బంగ్లాదేశ్ లో హిందువులు ఎంత నరకయాతన పడ్డారో పూర్తిగా అర్ధం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version