వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణంలో పసికందును కుక్కలు చంపిన ఘటన రాష్ట్రం అంత వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ పసికందు ఘటనతో ఎంజీఎం అధికారులలో చలనం వచ్చింది. పసికందును కుక్కలు చంపిన ఘటన పైనా ఇంటర్నల్ విచారణ చేస్తున్నారు ఎంజీఎం అధికారులు. ఆస్పత్రిలో సెక్యూరిటీ లోపం.. సీసీ కెమెరా అవసరాన్ని తెరపై గుర్తించారు అధికారులు.. దాంతో ఆస్పత్రిలో 160 సీసీ కెమెరాల ఏర్పాటుకు కలెక్టర్ నీ అనుమతి కోరారు ఎంజీఎం అధికారులు.
అదే విధంగా ఆస్పత్రిలో ఉన్న కుక్కల బెడదను మున్సిపల్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు ఎంజీఎం అధికారులు. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎంజీఎంలో డాగ్ క్యాచర్ టీమ్ తో కుక్కలను పట్టుకున్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సిబ్బంది. మొత్తం ఎంజీఎం హాస్పిటల్ ఆవరణంలో 12 కుక్కలను పట్టుకున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎంజీఎం హాస్పిటల్ కి వచ్చిన మృత శిశువు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.