IPL 2023 : హ్యారీ బ్రూక్‌ చరిత్ర..ఐపీఎల్‌ 16వ సీజన్‌ లో తొలి సెంచరీ

-

ఐపీఎల్ 2023 లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. మొదట పంజాబ్ జట్టుపై గెలిచిన హైదరాబాద్ నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్కతా పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

ఇక చేజింగ్ కు దిగిన కోల్కతా జట్టు… 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్… 55 బంతుల్లో సెంచరీ చేసుకున్నాడు. ఈ సీజన్ లో తొలి సెంచరీ తో చెలరేగగా అటు హైదరాబాద్ కెప్టెన్ 26 బంతుల్లో 50 పరుగులు చేసి హైదరాబాద్ జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే.. ఇందులో హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్… 13 ఫోర్లు, 3 సిక్సులతో… సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ 16 వ సీజన్‌ లో మొదటి సెంచరీ చేసి.. చరిత్ర సృష్టించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version