ప్రకృతి రమణీయతతో ఆలరించే తుల్జాభవానీ దేవాలయం విశేషాలు మీకు తెలుసా !

-

తుల్జాభవాని… మహారాష్ట్రతో పాటు దేశంలోని పలువురు అమ్మను ఆరాధిస్తారు. ఆదిశక్తి స్వరూపిణి అయిన అమ్మ తుల్జాభవాని దేవాలయ విశేషాలు.. ఎలా వెళ్లాలి తెలుసుకుందాం…

సహ్యాద్రి పర్వతశ్రేణులలోని యమునాచల కొండలలో ప్రశాంత నిశబ్ధ నగరం తుల్జాపూర్. ఇది మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో సముద్రమట్టానికి 650 కిలోమీటర్ల ఎత్తులో వుంది. సోలాపూర్ నుండి ఔరంగాబాద్ వెళ్ళే రహదారి పై ఈ నగరం వుంటుంది. చింతచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని పూర్వం చించాపూర్ అనేవారు. ఈ ప్రదేశానికి చెందిన చరిత్ర 12 వ శతాబ్దం నాటిది. ఒక పవిత్ర పర్యాటక ప్రాంతం తుల్జాపూర్ ఎన్నో సంవత్సరాలనుండి ప్రవాహంలా యాత్రికులు, భక్తులు సందర్శించే అద్భుత తీర్థయాత్ర ప్రాంతం. ఈ గ్రామంలో గల దేవత తుల్జా భవాని పేరున ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడమే కాక ఈ ప్రదేశం పేరును కూడ చించాపూర్ నుండి తుల్జాపూర్ గా మార్చారు.

History Of Tulja Bhavani Temple
History Of Tulja Bhavani Temple

సందర్శించాల్సిన ప్రదేశాలు

తుల్జాపూర్ లో మీరు చూడవలసిన ప్రదేశాలు భారత దేశం లోని 51 శక్తి పీఠాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న తుల్జా భవాని దేవాలయం కూడా ఒకటి. గొప్ప విష్ణు భక్తునిచే ఏర్పాటు చేయబడిన సంత గరీబ్ మట్ ప్రస్తుతం ఎన్నో రకాల యోగ, ధ్యాన పద్ధతులను తెలిపే ఇక్కడి మరొక తీర్థయాత్రా ప్రాంతం. సంత్ భారతి బువ మట్ మరొక చూడదగిన ప్రదేశం. యువ తుల్జాపూర్ అనే ధక్తే తుల్జాపూర్ పట్టణ శివార్లలోని ఉంది. ఇక్కడ తుల్జా భవాని దేవి చిన్న విగ్రహం వుంది. ప్రధాన దేవాలయాన్ని దర్శించిన అనంతరం ఈ దేవాలయ సందర్సన తప్పనిసరి అని నమ్ముతారు. ఇక్కడి ప్రతిమ ఒక ముస్లిం చే కనుగొనబడటం ఆసక్తికరమైన అంశం. రాతి నుండి ఒక ప్రత్యేక మైన పద్ధతిలో నిర్మించిన ఘట శిలా రామాలయం ఇక్కడ ఉంది. ఇక్కడ కల్లోల తీర్థము, విష్ణు తీర్థము, గోముఖ తీర్థము, పాపనాశి తీర్థము అనే కొన్ని ముఖ్యమైన ప్రసిద్ధ తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో మునగడం వలన పాపాలనుండి విముక్తి కల్గుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల అనేక మంది భక్తులు తమ ఇబ్బందులు, పాపాల నుండి శుభ్రపడగలమని నమ్ముతారు.

అందంగా కట్టిన పవిత్రమైన ప్రదేశం చింతామణి. గుండ్రంగా కట్టిన ఈ నిర్మాణంలో మాతంగి, నరసింహ, ఖండోబా, యమాయిదేవి ల చిన్నచిన్న విగ్రహాలు ఉన్నాయి. తుల్జాపూర్ కు దగ్గరగా గల అక్కల్కోట్, పంధర్పూర్ తప్పక చూడవలసిన ప్రదేశాలు. ఇక్కడకు ఎప్పుడు, ఎలా వెళ్ళాలి ? ఏడాదిలో చాలా వరకు తుల్జాపూర్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్గి ఉంటుంది. ఎండ వేడిమి తీవ్రంగా ఉండటం వల్ల వేసవికాలం సందర్శనకు అనువుగా ఉండదు. విపరీతమైన ఎండవేడిమి వల్ల మీరున్న వసతి గృహముల నుండి బయటకు రావడం అసాధ్యమైపోవడమే కాక సందర్శనకు కూడ వెళ్ళలేరు. అందుకే ఈ కాలం సందర్శనకు అనువైనది కాదు. వర్షాకాలం ఉపశమనాన్ని కల్గచేస్తూ చెప్పుకోదగిన వర్షాలను ఇస్తూ మొత్తం ప్రాంతాన్ని ఎంతో అందంగా నిర్మలంగా మారుస్తుంది. ఈ ప్రాంత సందర్శన ఈ కాలంలో వర్షప్రియులను అలరించినప్పటికి వర్షం అంటే ఇష్టం లేని వారు దూరంగా ఉండి పోతారు. శీతాకాలం తుల్జాపూర్లో గల దేవతలను దర్శించడానికి పరిసరాల దృశ్యాలను తిలకించుటకు అనువైనది.

నవరాత్రి, గుడి పర్వం, మకర సంక్రాంతి పండుగలు ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థానిక వేడుకలలో పాల్గొనడానికి అనువైనది. తుల్జాపూర్ లోని తీర్థయాత్ర స్తలానికి విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు. వాయు మార్గం ద్వారా వెళ్ళదలచుకుంటే పూణే విమానాశ్రయం దగ్గర మార్గం. అక్కడి నుండి టాక్సీలలో ఈ ప్రాంతానికి చేరవచ్చు. రైలు ద్వారా వెళ్ళదలిస్తే సోలాపూర్ రైలు స్టేషన్ తుల్జాపూర్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో అయితే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు లేదా ప్రైవేటు వాహనాలలో తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. చారిత్రిక తుల్జా భవాని దేవాలయాన్ని కల్గి ఉండటం వలన తుల్జాపూర్ లాంటి చిన్న పట్టణం ప్రసిద్ధి చెందింది. ఒక ప్రసిద్ధ యాత్రా స్థలంగా దేవుని ఆరాధించే ఏ భక్తుడైన చూడవలసిన ప్రాంతం తుల్జాపూర్.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news