టీమిండియా స్టార్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరురైన రికార్డు ను తన ఖాతలో వెసుకున్నాడు. అంతర్జాతీయ టీ ట్వంటి క్రికెట్ లో 3000 పరుగులు సాధించిన మూడో ప్లేయర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ మూడు వేల పరుగుల మార్క్ ను రోహిత్ శర్మ కేవలం 108 ఇన్నింగ్స్ లలోనే అందు కున్నాడు. కాగ ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ ట్వంటి క్రికెట్ లో ఇద్దరు మాత్రమే 3 వేల పరుగుల మార్క్ ను అందుకున్నారు. మొదటి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (3227) ఉన్నాడు.
రెండో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (3115) ఉన్నాడు. కాగ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు టీ ట్వంటి లలో 4 శతకాలు బాదిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ ట్వంటి క్రికెట్ లో ఏ ఆటగాడు కూడా 4 శతకాలు నమోదు చేయలేదు. కాగ టీ ట్వంటి వరల్డ్ కప్ ముగిసింది కాబట్టి విరాట్ కోహ్లి కెప్టెన్ నుంచి పూర్తి గా తప్పుకున్నాడు. తర్వాతి టీ ట్వంటి లకు వన్డే లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ నే కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది.