కరోనా వ్యాక్సిన్ తో హెచ్ఐవీ..క్లీనికల్ ట్రయల్స్ రద్దు..!

-

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రపంచమంతా కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇలాంటి తరుణంలో మరో నిరాశజనక వార్త అందింది. ఆస్ట్రేలియా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌లో ప్రతికూల మార్పులు ఎదురైనట్లు గుర్తించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారు. ఈ మేరకు వ్యాక్సిన్ తయారీదారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ, సీఎస్‌ఎల్‌ ఔషధ సంస్థ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.

vaccine

ఇక క్లినికల్ ట్రయల్స్‌లో తొలి దశలో ఈ టీకా ఆశాజనక ఫలితాలు ఇచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అయితే రెండు, మూడో దశలో కొంత మంది వాలంటీర్ల శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులకు గుర్తించినట్లు వెల్లడించారు. అయితే అవి అంత ప్రమాదకరమైనవేమీ కావని స్పష్టం చేశారు. అయినప్పటికీ ముందస్తు చర్యగా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను, అభివృద్ధిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ఈ వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలే వచ్చాయి. టీకాతో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాయి. కానీ రెండు, మూడో దశలో కొన్ని షాకింగ్ అంశాలను గుర్తించారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలో కలగజేసుకుంటున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం వల్ల హెచ్ఐవీ లేనివారికి కూడా పాజిటివ్ గా తేలిందని అధికారులు తెలిపారు.

అయితే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని పరిశోధకులు చెప్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల్లో మాత్రమే ప్రభావం చూపుతున్నాయని.. అలాగని ఆ వ్యక్తులకు హెచ్‌ఐవీ సోకినట్లు కాదని స్పష్టం చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వారికి హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..నెగెటివ్‌ అని తేలినట్లు వివరించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ఈ టీకాను కొనుగోలు చేసేందుకు సీఎస్‌ఎల్‌తో ఒప్పందం కూడా చేసుకుంది.

ఈ ఒప్పందంతో ఆ సంస్థకు దాదాపు 75 మిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరేది. కానీ ప్రయోగాలు రద్దు చేయడంతో దానికి బ్రేక్ పడింది. ‘టీకా అభివృద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయడం కఠినమైన నిర్ణయమే. అయినప్పటికీ కొందరిలో గుర్తించిన ప్రతికూల మార్పుల వల్ల ఇది తప్పడం లేదని సీఎస్‌ఎల్‌ పేర్కొంది. మరోవైపు ఆస్ట్రేలియా ఫైజర్‌‌తో పాటు మరికొన్ని సంస్థలతోనూ వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంది. దీంతో సీసీఎల్ వ్యాక్సిన్ ప్రయోగాలు రద్దయినా.. ప్రజలకు టీకా అందించడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news