దిగొచ్చిన ఏపీ సర్కార్..ఈనెల 10న సెలవు..!

వినాయక చవితి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మొదట ప్రభుత్వం వినాయక చవితి పండుగ కు సెలవు ప్రకటించలేదు. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకులు, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తీరు పై మండి పడ్డాయి. దాంతో దిగొచ్చిన ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా ఈనెల 10వ తేదీన సెలవు ప్రకటిస్తున్నట్టు పేర్కొంది.

jagan
jagan

ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అంతే కాకుండా నేగోషియబుల్ చట్టం ప్రకారం సెలవు ప్రతిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఇలా ఉంటే ఏపిలో కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండుగ ఉత్సవాలపై ఆంక్షలు విధించడంతో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెలవు విషయం లో ఒక అడుగు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.