సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం కానున్నారు. సీఎం చంద్రబాబు ఈ రోజు అంటే శనివారం రోజున ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల కోసం ఆదివారం రోజున ఆయన ప్రచారం చేయనున్నారు.
ఢిల్లీలో తెలుగు అసోసియేషన్లతో పాటు తెలుగువారు నివసించే ప్రాంతాల్లో బాబు ప్రచారం నిర్వహించనున్నారు. కాగా శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో చంద్రబాబు పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.