RRR.. ‘గే ఫిల్మ్’ అంటూ హాలీవుడ్ ఫ్యాన్స్ ట్రోల్స్..ముందే చెప్పానంటున్న RGV

-

అగ్రదర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR…దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమా చూసి జనం ఫిదా అయిపోయారు. 1920ల కాలం నాటి కల్పిత కథను వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించారు. కొమురం భీం, అల్లూరి సీతారామరాజులను అలా ఆకాశానికెత్తారు.

ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులైన రామ్ చరణ్, తారక్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎక్సలెంట్ గా వర్కవుట్ అయింది. బ్రోమాన్స్..స్నేహం, ప్రేమ పై విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని హాలీవుడ్ క్రిటిక్స్ సైతం మెచ్చుకున్నారు. కానీ, హాలీవుడ్ అభిమానులు RRRపై నెగెటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలా సినిమా పై ట్రోలింగ్ చేస్తున్నారు.

రామ్ చరణ్, తారక్ మధ్య ఉన్నది గే రిలేషన్ షిప్ అని ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్రన్ నెటిజన్లు ..ఇలా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ చిత్రం గే మూవీ అని ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు. కాగా, ఆ ట్వీట్లపై వచ్చిన వార్త కథనాన్ని ట్వీట్ చేసిన వివాదాస్పద దర్శకుడు RGV.. నేను ముందే చెప్పానన్నట్లు ట్వీట్ చేశాడు. ‘నేను చెప్పిందే నిజం..వెస్ట్రన్ ఆడియన్స్ దృక్పథంలో ఆర్ఆర్ఆర్ గే స్టోరి’ అని పేర్కొన్నాడు. మొత్తంగా RRR మూవీ మళ్లీ హైలైట్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version