యంగ్ ఇండియా స్కూల్లో ఫీజులు చూసి నోరెళ్లబెట్టిన జనం

-

తెలంగాణ ప్రభుత్వం మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ స్కూల్ ప్రారంభించి విద్యార్థులకు మ్యాజిక్ బాక్సులను సైతం అందజేశారు. ఇందులో 50శాతం పోలీసు కుటుంబాలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించగా.. మిగతా 50 శాతం సామాన్యులకు కేటాయించారు.

అయితే,యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ఫీజులు సామాన్యులకు అందుబాటులో లేవని తెలుస్తోంది.ఏడాదికి లక్షన్నర వసూలు చేస్తున్నారని.. ప్రైవేట్ స్కూల్ ఫీజులను నియంత్రిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. ప్రైవేట్ స్కూల్స్ కంటే అధికంగగా ఫీజులు వసూలు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. 50 శాతం సామాన్యులకు రిజర్వేషన్ ఉన్నా ఈ స్కూల్లో ఫీజు ఏడాదికి రూ.1,60,000లుగా ఉంది. ప్రభుత్వం నడిపించే స్కూల్లో ఇంత దారుణమా? అని జనాలు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news