జగనన్న కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఇబ్బందులకు గురిచేసింది : తానేటి వనిత

-

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత హాజరై మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ అవిర్భవించి 12 ఏళ్ళు అయిన సందర్భంగా అన్ని నియోజకవర్గాలలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దివంగత వైస్సార్ కాలం చేశాక జగనన్న కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఇబ్బందులకు గురిచేసిందంటూ ఆమె కాంగ్రెస్‌ పార్టీని విమర్శించారు.

జగనన్న కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఎదిరించి మనందరికీ అండగా నిలబడ్డారని అన్నారు వనిత. మూడేళ్ళల్లో ప్రభుత్వమే ప్రజల్లో వుందని, జగనన్న ఏపీలో చక్కని పాలన అందిస్తున్నారని కొనియాడారు వనిత. మనరాజు జగనన్న బలవంతుడు అయినందునే ప్రతిపక్షాలు ఒక్కటవ్వాలని చూస్తున్నారన్నారు వనిత. ప్రతిపక్షం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, 2024లో కూడా జగనన్ననే సీఎం చేసుకోవాలని వనిత కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version