పోలీసులు కుక్క‌ల్లా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హోం మంత్రి

-

పోలీసులు లంచాలు తీసుకుని కుక్క‌ల్లా నిద్ర పోతున్నార‌ని క‌ర్ణాట‌క హోం మంత్రి అర‌గ జ్ఞానేంద్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైర‌ల్ అవుతుంది. పోలీసుల‌ను కుక్క‌ల్లా పోల్చ‌డం పై చాలా మంది హోం మంత్రి ని త‌ప్పు ప‌డుతున్నారు. అయితే దీని పై హోం మంత్రి అర‌గ జ్ఞానేంద్ర వివ‌ర‌ణ ఇచ్చాడు. తాను అంద‌రి పోలీసుల గురించి అనలేద‌ని.. కొంత మంది గురించి మాత్ర‌మే అన్నాన‌ని అన్నారు.

క‌ర్ణాటక లోని శివ‌మొగ్గ జిల్లా లోని ఒక గ్రామంలో జంతు స్మ‌గ్ల‌ర్లు విరవిహారం చేస్తున్నార‌ని అన్నారు. జంతువుల ను స్మ‌గ్లింగ్ చేస్తుంది.. అధికారుల‌కు తెలుస‌ని.. కానీ వీరు లంచాలు తీసుకోవ‌డం వ‌ల్ల వారి పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని హోం మంత్రి అర‌గ జ్ఞానేంద్ర అన్నారు. రాష్ట్రం లో గోవ‌ద నిషేధ చ‌ట్టం ప‌క‌డ్భంది గా అమలు చేస్తున్నా.. కొంత మంది పోలీసులు లంచాలు తీసుకోవ‌డం వ‌ల్ల జంతువుల స్మ‌గ్లింగ్ జ‌రుగుతుంద‌ని అన్నారు. అలాగే ఒక చోట స్మగ్లింగ్ ను అడ్డుకున్న ఒక స్వ‌చ్ఛంద సంస్థ ప్ర‌తినిధుల పై కి వాహనాలు ఎక్కించార‌ని తెలిపారు. వారి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మం గా ఉంద‌ని అన్నారు. అందుకే కొంత మంది పోలీసుల అలాంటి వ్యాఖ్య‌లు చేసాన‌ని వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version