చీమలతో మొక్కలను కాపాడుకుందాం ఇలా..?

-

హరితహారం, గ్రీన్‌ ఛాలెంజ్‌ పేర్లతో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం.. అలాగే మన ఇంట్లో కూడా మొక్కలు పెంచుకుంటున్నాం. పచ్చదనం మన చుట్టూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. పచ్చదనంతో ఇళ్లంతా ఆహ్లాదకరంగా మారుతుంది. మనుసుకు ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి మొక్కల మొదళ్లను చీమలు పట్టి పిండేస్తుంటే.. చూసు ఊరుకోలేం. మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే మొక్కలను రక్షించుకునే బాధ్యత మనపైనే ఉంటుంది. కానీ ఏం చేయాలి. చీమలు వచ్చి మొదళ్లను తింటుంటే.. వాటికి కాపలా కూర్చోవాలా? ఒకవేళ కూర్చున్నా వచ్చిన చీమలన్నింటినీ పట్టుకుని నలిపేయాలా? మొక్కల నుంచి చీమలకు చరమ గీతం పాడలేమా? పాడొచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లు దీనికి ఉంది. కొన్ని పద్ధతులు పాటించి వాటిని ఫాలో అయితే సరి. మీకు ఆనందాన్నిచ్చే మొక్కల సంరక్షణ మీ చేతుల్లోనే..

మొక్కల సంరక్షణ

– మొక్కలన్నాక కుండీలుంటాయి. వాటికి చీమలు, దోమలు, పురుగులు వచ్చి చేరడం సహజం. దీన్ని అలానే చూస్తూ ఉంటే చీమలు కాస్త పుట్టలుగా మారడాన్ని చూడాల్సి వస్తుంది. ఈ చీమలు ఉంటే పర్వాలేదు. వీటితో వచ్చిన తంటా ఏంటంటే.. మొక్కల పాదులో తేమ లేకుండా పీల్చేస్తుంది. తద్వారా మొక్కలు ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే..

– ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో చెంచాడు పసుపు తీసుకొని దానిలో నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మొక్కల మొదల్లలో చీమల గూళ్లు తయారు చేసుకున్న స్థలంలో పోయాలి. ఇలా ఉదయం సాయంత్రం పోస్తే చాలు చీమలు మకాం మరో చోటుకి మార్చేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకున్నట్లే.

– చీమలు బెడద తప్పింది అనుకనే సరికి పురుగు సమస్య తలెత్తుతుంది. ఈ పరుగు ఏకంగా ఆకులను కొరికి తినేస్తుంది. ఇలా తింటూ పోతే చెట్టుపై ఒక ఆకు కూడా ఉండదు. దీంతో మొక్కే ఎండిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ సారి మొక్కలకు పురుగు పడితే వేప లేదా ఆవాల చూర్ణాన్ని నీళ్లలో కలిపి మొక్కలపై చిలకరించాలి. ఆ వేప వాసనకు పురుగు అక్కడికక్కడే చావడం పక్కా. కావాలంటే వాటికి అక్కడే సమాది కూడా కట్టుకోవచ్చు.

– కొన్ని చెట్లలకు మంచి నీరే పోయాలనేం లేదు. కొన్నింటికీ బురద నీరు కూడా సరిపోతుంది. అలానే అరటిచెట్టు బురద నీరు ఎలా పీల్చుకుంటుందో.. మందారం చెట్టుకి కాఫీ పొడి కూడా అంత బలాన్ని ఇస్తుంది. దీన్లో చాలా పోషకాలున్నాయి. దాంట్లో ఉండేవన్నీ మందారం చెట్టు హక్కున చేర్చుకుంటుంది. దీంతో చెట్టు ఎక్కువ పూలు పూస్తుంది. ఆ పూలతో మన ఇంట్లోనే కాదు పక్కింటి వాళ్లకు కూడా ఇవ్వొచ్చు.

– తులసి మొక్కలో ఏవి పడితే అవి వెయ్యలేం కదా. అందుకే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్‌ ఉల్లిగడ్డను తులసి మొక్క పాదులో గుచ్చాలి. ఆ వాసనకు ఎలాంటి పురుగు, చీమలు దరిచేరదు.

– మొక్కల పాదుల్లో నీరు నిలిచినప్పుడు ఈగలు, దోమలు వాలుతుంటాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి.

– ఎక్పైర్‌ అయిన ట్యాబ్లెట్లు, టానిక్‌లు దిబ్బలో పడేయకుండా దాచిపెట్టండి. వాటన్నింటినీ తీసుకొని మొక్కలకు వేస్తే ఏపుగా పెరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news