హువావే నుంచి కొత్త పాడ్ ఇండియాలో లాంచ్ చేయనుంది. చాలా కాలం తర్వాత కొత్త ఉత్పత్తిని కంపెనీ విడుదల చేయనుంది. హానర్ ప్యాడ్ 8 అనే ట్యాబ్లెట్. అంతర్జాతీయ మార్కెట్లో జులైలో లాంచ్ అయింది. ఇండియాలో త్వరలో లాంచ్ కానుంది. హానర్ ప్యాడ్ 8 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఈ ట్యాబ్‌కు సంబంధించిన లీక్ అయిన వివరాలు ఇలా ఉన్నాయి..
హానర్ ప్యాడ్ 8 ధర (అంచనా)
ఈ ట్యాబ్‌లో చైనాలో మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,499 యువాన్లుగా (సుమారు రూ.17,700) నిర్ణయించారు.
ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగానూ (సుమారు రూ.21,240),
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగానూ (సుమారు రూ.23,600) నిర్ణయించారు.
మింట్ గ్రీన్, డాన్ బ్లూ, డాన్ గోల్డ్ రంగుల్లో ఈ ట్యాబ్ అందుబాటులోకి వచ్చింది.
మనదేశంలో కూడా ఇదే ధరతో ఈ ట్యాబ్ లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా..
హానర్ ప్యాడ్ 8 స్పెసిఫికేషన్లు..
ఈ బడ్జెట్ ట్యాబ్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది కాబట్టి స్పెసిఫికేషన్ల విషయంలో ఎటువంటి రహస్యం లేదు.
దీని చైనా వేరియంట్లో 12 అంగుళాల 2కే ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 2000 x 1200 పిక్సెల్స్ గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 87 శాతం గానూ ఉంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ హానర్ ప్యాడ్ 8లో ఉన్నాయి.
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ట్యాబ్లెట్ వెనకవైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
ముందువైపు కూడా 5 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 7250 ఎంఏహెచ్ కాగా, 22.5W ఫాస్ట్ చార్జింగ్‌ను హానర్ ప్యాడ్ 8 సపోర్ట్ చేయనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది.
ఎనిమిది స్పీకర్లను హానర్ ప్యాడ్ 8లో అందించారు.
వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని మందం 0.69 సెంటీమీటర్లు కాగా, బరువు 520 గ్రాములుగా ఉంది.