సీఎం జగన్ మరో శుభవార్త.. ఆరోగ్యశ్రీలో కొత్త చికిత్సలు

-

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఆరోగ్యశ్రీలో కొత్త చికిత్సలు చేరుస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వైయస్సార్ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉన్నాయి. అక్టోబర్ 15 నుంచి కొత్త పార్టీ చేరికతో ఈ సంఖ్య 3,254 కి చేరనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు.

ఆసుపత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలని, దీనికోసందీనికోసం ప్రతినెలా కూడా ఆసుపత్రుల వారిగా ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ” ఆరోగ్యశ్రీ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు 3 రెట్లు పెరిగింది. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీ కి సుమారుగా రూ. 2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ. 300 కోట్లు, 108, వన్ జీరో ఫోర్ వాహనాల సేవల కోసం సుమారు మరో రూ. 400 కోట్లు చేస్తున్నామన్నారు. మొత్తంగా దాదాపు రూ. 3,200 కోట్లు వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది” అని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version