ఇంతకాలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే… అది ఒక పేరు.. ఒక అధికారి పేరు. కానీ గతకొంతకాలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే… కొంతమందికి ఒక సంచలనం, మరికొంతమందికి ఎస్.ఈ.సీ. పదవికి అనర్హుడు, ఇంకొందరికి బలిపశువు! ఇందులో ఏది నిజమో, ఏది కన్ ఫాం చేసుకోవాలో ఆయనే చెప్పాలి! ఆ సంగతులు అలా ఉంటే… రోజురోజుకీ జరుగుతున్న పరిణామాలు, నిమ్మగడ్డ యవ్వారాలను గమనిస్తున్న ఏపీ అధికారపార్టీ నేతలు… ఆయనపై ప్రతిపక్షాలకు మించిన విమర్శలు చేస్తున్నారు!!
ఈ క్రమంలో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మైకందుకున్నారు. రావడం రావడమే.. చాలా మందికి అనుమానం వచ్చేలా కొత్త డౌట్ ఒకటి తెరపైకి తీసుకొచ్చారు! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా “చెప్పుకుంటున్న” నిమ్మగడ్డ రమేష్ కుమార్ యవ్వారం ఏమీ బాగాలేదు అని మొదలుపెట్టిన శ్రీకాంత్ రెడ్డి… కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టులో కేసులు వేస్తున్న నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు!
ఇంతకాలం ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఆమాత్రం దాచుకుని ఉండరా.. సేవింగ్స్ లో ఉన్న సొమ్మును నాలుగురోజుల్లో ముగిసిపోయే పదవి కోసం కోర్టులకు తగలెట్టరా? ఎందుకు పెట్టారు.. పెడతారు పెడతారు! ఇష్యూ అలాంటిది మరి!! నిజంగా నిమ్మగడ్డ తరుపున వాదిస్తోన్న న్యాయవాదులు చిన్నవారు కాదు, మామూలోళ్లు కాదు.. వారికి పేమెంట్స్ గంటల లెక్కన ఉంటాయి! మరి అంతేసి ఖర్చులు నిమ్మగడ్డ ఎలా భరిస్తున్నారు? ఈ సమయంలోనే కొత్త డౌట్స్ తెస్తున్నారు వైకాపా నేతలు!
పార్కహయత్ లో బాబుకు ఎంతో దగ్గరైన, ధనవంతులైన బీజేపీ నేతలను నిమ్మగడ్డ కలవకముందు ఈ అనుమానం ఉన్నా పర్లేదు కానీ… వారితో (రహస్య) భేటీ అనంతరం కూడా అలాంటి అనుమానం రావడం ఏమిటని శ్రీకాంత్ రెడ్డిపై ఫైరవుతున్నారు నెటిజన్లు!